నర్వ మండలంలోని రాంపూర్ కి ప్రభుత్వ బస్సు సేవలు పునఃప్రారంభమయ్యాయి. గతంలో టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాల సమయంలో బస్సు నడిచేది కానీ మధ్యలో నిలిచిపోయింది. ఇప్పుడు మంత్రి శ్రీహరి చొరవతో మరికల్ నుంచి ఆత్మకూర్ వరకు ఉదయం 8:30కు, సాయంత్రం 4గంటలకు తిరిగి నడవనుంది. గురువారం ట్రయల్ జరగగా, శుక్రవారం నుంచి అధికారికంగా కొనసాగుతుందని కాంగ్రెస్ నేత నాగన్న శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.