మక్తల్‌లో సెప్టెంబర్ 3న జిల్లా స్థాయి మౌంటెన్ సైక్లింగ్ పోటీలు

తెలంగాణ రాష్ట్ర సైక్లింగ్ అసోసియేషన్ ఆదేశాల మేరకు, నారాయణపేట జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 3న మక్తల్ కొత్తగార్లపల్లి మట్టి రోడ్డులో 5 కి.మీ. మౌంటెన్ సైక్లింగ్ పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన కార్యదర్శి బి. గోపాలం బుధవారం తెలిపారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను సెప్టెంబర్ 6న శామీర్‌పేటలోని భూమ్ భూ ఫారెస్ట్ పార్క్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తారు. ఆసక్తిగల బాలబాలికలు, యువతీ యువకులు టెన్త్ మెమో, బోనఫైడ్, ఆధార్, రెండు ఫొటోలు, సైకిల్, హెల్మెట్‌తో హాజరుకావాలి.

సంబంధిత పోస్ట్