మక్తల్ లో డ్రైనేజీ పైకప్పు ధ్వంసం

నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలోని 167వ జాతీయ రహదారిపై అయ్యప్ప ఆలయానికి వెళ్లే మార్గంలో డ్రైనేజీపై ఉన్న పైకప్పు ధ్వంసమైంది. భారీ వాహనాలు, అధిక లోడుతో వెళ్లే లారీలను డ్రైనేజీపై నడపడం వల్లే పైకప్పు దెబ్బతిన్నట్లు స్థానికులు భావిస్తున్నారు. దీంతో వాహనదారులు, స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ధ్వంసమైన డ్రైనేజీ పైకప్పును ఎవరు పునర్నిర్మించాలి, ఏ శాఖ అధికారుల పరిధిలో ఈ అంశం ఉందనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. సంబంధిత అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕