జంగంరెడ్డిపల్లిలో ఫిల్టర్ వాటర్ షెడ్ నిర్మాణానికి భూమిపూజ

నారాయణపేట జిల్లా, మక్తల్, జంగంరెడ్డిపల్లి గ్రామంలో ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందించే లక్ష్యంతో నూతన ఫిల్టర్ వాటర్ షెడ్ నిర్మాణానికి శుక్రవారం భూమిపూజ జరిగింది. మంత్రి వాకిటి శ్రీహరి ఆదేశాల మేరకు హెచ్‌డీఎఫ్‌సీ పరివర్తన్ సౌజన్యంతో రామ్‌కీ సంస్థలు ఈ కార్యక్రమాన్ని చేపట్టాయి. గ్రామ సర్పంచ్ తిరుపతమ్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చెన్నయ్య సాగర్, మండల కిసాన్ సేల్ అధ్యక్షుడు బి. రాజారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని పనులను ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్

✕
✕