కన్నె స్వాములకు దిశానిర్దేశం

నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణం అయ్యప్ప స్వామి దేవాలయంలో నేడు పదిమంది స్వాములు మొదటిసారి అయ్యప్ప మాల స్వీకరించారు. ఈ సందర్భంగా మాలాధారణ అనంతరం శ్రీధర్ గురుస్వామి ఆధ్వర్యంలో వారికి మాల నియమాలను వివరించారు. ఆయన మాట్లాడుతూ రెండు పూటలా చన్నీటి స్నానం, ఏకభుక్తం చేయాలని, బ్రహ్మచర్యం పాటించాలని, కటిక నేలపై పడుకోవడంతోపాటు, నిత్యం అయ్యప్ప నామస్మరణ, రెండు పూటలా తప్పకుండా మంగళహారతి తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మొదటిసారి మాల వేసుకున్న కన్న స్వాములు, కత్తి స్వామి, గురు స్వాములు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕