అఖిలభారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి అధ్యక్షులు రాజ్ దేశ్ పాండే ఆధ్వర్యంలో గత నెల 30న మక్తల్ పట్టణంలో 25 సంవత్సరాల దీక్ష పూర్తి చేసుకున్న స్వాములకు గౌరవ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఇట్టి కార్యక్రమంలో అనివార్య కారణాల వలన హాజరుకాని స్వాములను బుధవారం అయ్యప్ప ఆలయంలో సన్మానించారు. ఈ సందర్భంగా రాజు పాదయాత్ర స్వామి మాట్లాడుతూ ప్రత్యేక సేవలకు గుర్తింపుగా ఈ సన్మానం నిర్వహించామని తెలిపారు. కార్యక్రమంలో గురు స్వాములు అశోక్ గౌడ్, పవన్ గౌడ్, విజయ్, రాకేష్ స్వామి తదితరులు పాల్గొన్నారు.