వినాయక నిమజ్జనంలో భాగంగా నారాయణపేట జిల్లా మక్తల్ మండలం గొలపల్లి గ్రామంలో శ్రీ ఆంజనేయం యూత్ వారు ప్రతిష్టించిన మట్టి వినాయకుడి నిమజ్జోత్సవ అలంకరణ చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఉగ్ర నరసింహుడితోపాటు, శ్రీ చక్రం అలంకరించి మట్టి వినాయకుడిని ఊరేగింపుగా గంగమ్మ వాడికి చేరుస్తామని, గత 11 సంవత్సరాలుగా మట్టి వినాయకుని ప్రతిష్టిస్తూ తమ వంతు బాధ్యతగా నదీ జలాలు కాలుష్యం కాకుండా ప్రచారం చేస్తున్నామని సభ్యులు తెలిపారు. కాగా గత 11 రోజులుగా నియోజకవర్గ వ్యాప్తంగా పూజలు అందుకున్న వినాయకులు నేడు గంగమ్మ ఒడికి చేరనున్నాయి.