నారాయణపేట జిల్లా మక్తల్ మండలం గుర్లపల్లి గణేష్ ఉత్సవ కమిటీ తాయమ్మ దేవాలయం నందు జరిగినటువంటి లడ్డు వేలం పాటలో గ్రామానికి చెందిన ఆంజనేయులు గౌడ్ కుటుంబ సభ్యులు పెద్ద లడ్డు ను రూ. 33,333 దక్కించుకున్నారు. మరో చిన్న లడ్డు రూ. 3000 లకు బొంబాయి హనుమంతు కుటుంబ సభ్యులు దక్కించుకున్నారు. వారు మాట్లాడుతూ లడ్డు తమకు దక్కడం అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది.