మక్తల్ లో గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు

నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలోని స్థానిక HP పెట్రోల్ బంక్ వద్ద బుధవారం గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఉట్కూరు మండలం కొల్లూరు గ్రామానికి చెందిన నర్సింలు అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. మక్తల్ చెరువు కట్ట సమీపంలోని పెట్రోల్ పంపు మూలమలుపు వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు సమాచారం అందించడంతో 108 అంబులెన్స్ ద్వారా అతడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం మహబూబ్నగర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్