బండ తిరుమలయ్య స్వామిని దర్శించుకున్న మంత్రి వాకిటి

నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో కర్నె రోడ్డులో వెలసిన బండ తిరుమలయ్య స్వామిని మంత్రి వాకిటి శ్రీహరి సోమవారం దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు అనంతరం మాట్లాడుతూ చరిత్ర కలిగిన ఈ ఆలయం పునర్ నిర్మాణం చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని, ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం భక్తులను మంత్ర ముగ్ధులను చేస్తుందని అన్నారు. ఆ స్వామి ఆశీస్సులు మక్తల్ ప్రజలకు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం ఆలయ అర్చకులు మంత్రికి తీర్థప్రసాదాలు అందజేశారు.

సంబంధిత పోస్ట్

✕
✕