నారాయణపేట: నోటీసుల దెబ్బకు దిగొచ్చిన మిల్లర్లు

మక్తల్ నియోజకవర్గ పరిధిలోని ఆరు రైస్ మిల్లర్ల యజమానులు గతంలో సీఎంఆర్ కింద ప్రభుత్వానికి చెల్లించాల్సిన సుమారు రూ.33 కోట్ల విలువైన బియ్యాన్ని చెల్లించడానికి సివిల్ సప్లై అధికారులతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. ధాన్యం నిల్వకు సరైన వసతులు లేకపోవడం, అధికారుల నిర్లక్ష్యం వంటి కారణాలతో మిల్లర్లు బియ్యం చెల్లింపులో ఆలస్యం చేశారు. ప్రభుత్వం సీరియస్ అయి, మిల్లర్లను తనిఖీ చేసి, సీజ్ చేస్తామని హెచ్చరించడంతో, వారు విడతల వారీగా బియ్యం చెల్లిస్తామని అంగీకరించారు. రైతుల నుండి కొనుగోలు చేసిన ధాన్యం మిల్లర్లకు చేరినట్లు ఆధారాలు ఉండటంతో ప్రభుత్వం ఒత్తిడి తెచ్చింది.

సంబంధిత పోస్ట్