మక్తల్ నియోజకవర్గ స్థాయి క్రికెట్ 'మినిస్టర్ కప్' టోర్నమెంట్‌లో నర్వ మండల ఉపాధ్యాయుల జట్టు విజేతగా నిలిచి ట్రోఫీని కైవసం చేసుకుంది. తెలంగాణ రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ప్రోత్సాహంతో, నారాయణపేట జిల్లా యువజన క్రీడల అధికారి వెంకటేష్ శెట్టి ఆధ్వర్యంలో శనివారం ఈ టోర్నమెంట్ నిర్వహించబడింది. మక్తల్, మాగనూర్, కృష్ణ, నర్వ, ఉట్కూరు మండలాల ఉపాధ్యాయ జట్లు పాల్గొన్న ఈ టోర్నమెంట్‌లో, ఫైనల్ మ్యాచ్‌లో నర్వ జట్టు ఉట్కూరు జట్టును ఓడించింది.