లంకాలలో కొత్త రేషన్ కార్డులు పంపిణీ

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కొత్తరేషన్ కార్డుల పంపిణీ రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెన్నయ్య సాగర్ లంకాల గ్రామంలో లబ్ధిదారులకు శుక్రవారం అందజేశారు. పేదలకు రేషన్ కార్డులు లేక ఏళ్ళ తరబడి ఎదురుచూస్తున్నారని, వారి కళ కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వం నెరవేర్చిందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్