సీఎం దిష్టిబొమ్మ దాచిపెట్టారని నడిరోడ్డుపై నిరసన

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సిట్ నోటీసులు అందజేసిన నేపథ్యంలో, నారాయణపేట జిల్లా కృష్ణా మండలం టైరోడ్ కూడలిలో మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను పోలీసులు దాచిపెట్టడంతో ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దిష్టిబొమ్మ ఇచ్చేవరకు లేచేది లేదని పోలీసులను హెచ్చరించారు. అనంతరం దిష్టిబొమ్మను టిఆర్ఎస్ శ్రేణులకు అందజేయడంతో వారు దానిని దగ్ధం చేశారు.

సంబంధిత పోస్ట్