వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం తెల్లాపూర్ కు చెందిన అమృతమ్మ, పక్క గ్రామ ఆనంద్ తో అక్రమ సంబంధం పెట్టుకుంది. నగలు అమ్మి డబ్బులు వాడుకున్న ఆనంద్, డబ్బులు అడిగిన అమృతమ్మను సెప్టెంబర్ 18న హత్య చేసి, కాల్చివేశాడు. శరీరం పూర్తిగా కాలకపోవడంతో, మృతదేహాన్ని నారాయణపేట జిల్లా కృష్ణ మండలం కర్ణాటక సరిహద్దుల్లో కృష్ణా నది తీరాన విసిరేశాడు. పోలీసులు ఆనంద్ ను విచారించి, మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రికి శనివారం తరలించారు.