స్మశాన వాటిక ఆక్రమణపై గ్రామస్తుల ఆందోళన

నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలోని చిట్యాల గ్రామంలో సర్వే నెంబర్ 173లో ఉన్న 1-20 గుంటల స్మశాన వాటికను కొందరు వ్యక్తులు ఆక్రమించుకున్నారని గ్రామస్తులు ఆరోపించారు. ఈ విషయంపై వారు నేడు జిల్లా అదనపు రెవెన్యూ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. స్మశాన వాటిక స్థలాన్ని వెంటనే స్వాధీనం చేసుకుని, సర్వే హద్దులను నిర్ణయించాలని వారు కోరారు. దీనిపై స్పందించిన అదనపు రెవెన్యూ కలెక్టర్ అధికారులకు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో చిట్యాల గ్రామస్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్