స్మశానం దగ్గర బోరులో ఉన్న మోటార్ చోరీ

మక్తల్ మండలంలోని గొల్లపల్లి గ్రామంలో గ్రామస్తుల అవసరాల కోసం ఏర్పాటు చేసిన నీటి బోరులో ఉన్న మోటార్, స్టార్టర్, కేబుల్ వైర్ ను గుర్తు తెలియని వ్యక్తి సోమవారం రాత్రి చోరీ చేశారు. సుమారు రూ.50వేల విలువైన ఈ మోటార్ ను గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో బోరుకు బిగించారు. ఉదయం నీటి కోసం వెళ్లి చూడగా ఖాళీ పైపులు మాత్రమే కనిపించాయి. గ్రామస్తులు ఆశ్చర్యం వ్యక్తం చేయగా, సర్పంచ్ సూర్యకుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్