వాతావరణ శాఖ అంచనాల ప్రకారం, జిల్లాలో నేడు పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. మక్తల్, నార్వ మండలాల్లో ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్ష సూచనతో అరెంజ్ అలర్ట్ జారీ చేయబడింది. నారాయణపేట, కోస్గి, మరికల్, మాగనూర్ తదితర మండలాలకు ఎల్లో అలర్ట్ జారీ అయ్యింది. మద్దూర్, ధన్వాడ, ఉట్కూర్, కొత్తపల్లి ప్రాంతాల్లో సాధారణ వర్ష సూచన ఉంది. ప్రజలు ఉరుములు, పిడుగుల సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.