యువ నటుడు నార్నే నితిన్ కొత్త సినిమా పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. 'జూనియర్' ఫేమ్ దర్శకుడు రాధాకృష్ణారెడ్డి తెరకెక్కిస్తున్న ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లో కన్నడ నటి మేఘా శెట్టి, అనిఖా సురేంద్రన్ కథానాయికలుగా నటిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె. నారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే ఆసక్తి నెలకొంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది.