టైర్లు లేకుండానే ల్యాండ్ అయిన నాసా విమానం

అమెరికాలోని హూస్టన్‌ సమీపంలో ఎల్లింగ్టన్‌ విమానాశ్రయంలో నాసాకు చెందిన డబ్ల్యూబీ57 రకం విమానం బుధవారం నాడు సాంకేతిక సమస్య కారణంగా అత్యవసర ల్యాండింగ్ అయింది. ల్యాండింగ్ గేర్ తెరచుకోకపోవడంతో టైర్లు లోపలికే ఉండిపోయాయి. అయినప్పటికీ, పైలట్ల చాకచక్యంతో విమానం నేరుగా బాడీతో రన్‌వేను తాకుతూ సురక్షితంగా దిగింది. ఈ ఘటనలో విమానం దిగువ భాగంలో మంటలు చెలరేగినా, అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి మంటలను ఆర్పేశారు. విమానంలోని వారంతా క్షేమంగా బయటపడ్డారు. ఈ అరుదైన ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్