SRHలోకి నటరాజన్ రీఎంట్రీ

యార్కర్ల కింగ్ టి. నటరాజన్ మళ్లీ సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టులోకి రీఎంట్రీ ఇచ్చారు. IPL 2027 సీజన్‌కు ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్లను ట్రేడ్ చేసుకున్నాయి. DC బౌలర్ నటరాజన్‌ SRHలోకి వచ్చారు. SRH లెగ్ స్పిన్నర్ జీషన్ అన్సారీ DCలోకి వెళ్లారు. నటరాజన్ 2020 నుంచి 2024 వరకు HYD జట్టులోనే ఉన్నారు. 2024లో 19 వికెట్లతో సత్తా చాటిన అతణ్ని 2025 వేలంలో రూ.10.75 కోట్లకు DC దక్కించుకుంది. ఇప్పుడు SRH రూ.5 కోట్లకు తిరిగి తీసుకుంది. అటు అన్సారీని DC రూ.40 లక్షలకు కొనుగోలు చేసింది.

సంబంధిత పోస్ట్

✕
✕