భగవంత్‌ కేసరికి జాతీయ అవార్డు.. చంద్రబాబు అభినందనలు

నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్‌ రావిపూడి తెరకెక్కించిన ‘భగవంత్‌ కేసరి’ చిత్రానికి జాతీయ ఉత్తమ చిత్రం (తెలుగు) అవార్డు దక్కిన విషయం తెలిసిందే. అవార్డు రావడంపై ఏపీ సీఎం చంద్రబాబు ఆనందం వ్యక్తం చేశారు. శుక్రవారం 'ఎక్స్‌' వేదికగా చిత్రబృందానికి శుభాకాంక్షలు చెప్పారు. "ప్రేక్షకాదరణ పొందిన భగవంత్‌ కేసరి సినిమాకి జాతీయ అవార్డు రావడం సంతోషకరమైన విషయం. హీరో బాలకృష్ణ, చిత్రబృందానికి శుభాకాంక్షలు" అని చంద్రబాబు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్