'బలగం' బృందానికి KTR అభినందనలు

బలగం సినిమాలోని 'ఊరు పల్లెటూరు' పాటకు బెస్ట్ లిరిక్స్ విభాగంలో జాతీయ అవార్డు సాధించిన ప్రముఖ గేయ రచయిత కాసర్ల శ్యామ్‌కు, బలగం బృందానికి కేటీఆర్ అభినందనలు తెలిపారు. తెలంగాణలోని పల్లెవాసనకు పట్టం కట్టి ఆ పరిమళాలను విశ్వవ్యాప్తంగా వెదజల్లిన బలగం సినిమాకు నేషనల్ అవార్డ్ దక్కడం 4 కోట్ల రాష్ట్ర ప్రజలకు ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు. ఊరు పల్లెటూరు పాట కుటుంబాలను ఏకం చేయడమే కాదు.. మూడు తరాలను దగ్గర చేసిందని తెలిపారు.

సంబంధిత పోస్ట్