"కాకరకాయ రసం శరీరంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.. ఇన్సులిన్ సెన్సిటివిటీ పెంచి మధుమేహ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మెంతి గింజలలో ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. నానబెట్టిన మెంతి గింజలను ఉదయం భోజనంలో చేర్చుకోవడం వల్ల గ్లైసెమిక్ నియంత్రణ మెరుగుపడుతుంది. ఉసిరికాయను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించవచ్చు. దాల్చిన చెక్క ఇన్సులిన్ సెన్సిటివిటీని సమర్థవంతంగా మెరుగుపరుస్తుంది." అని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.