దోమల బెడదకు సహజ చిట్కాలు: సాంబ్రాణి, వేప నూనెతో ఉపశమనం

ఇంట్లో చిన్న పిల్లలకు వాడే సాంబ్రాణి, వేప నూనె వంటి సహజ పద్ధతులతో దోమల బెడదను తగ్గించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అరోమాల్యాంప్స్‌లో సాంబ్రాణి, కర్పూరం, వేప నూనె లేదా యూకలిప్టస్, లెమన్ గ్రాస్, లావెండర్ నూనెలు వాడటం వల్ల దోమలు దూరంగా ఉంటాయని, ఇది రూమ్ ఫ్రెషనర్‌గా కూడా పనిచేస్తుందని తెలిపారు. ఒక గ్లాస్ నీటిలో ఒక టీ స్పూన్ వేప నూనె, అర టీ స్పూన్ బేకింగ్ సోడా కలిపి స్ప్రే చేయడం, లేదా లావెండర్ నూనెను గదుల్లో స్ప్రే చేయడం, చేతులు, కాళ్లకు రాసుకోవడం వల్ల దోమల నుంచి రక్షణ పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్