దక్షిణాది సినీ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్‌గా గుర్తింపు పొందిన నయనతార, తన సినీ ప్రయాణంలో 23 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అభిమానులతో ఎమోషనల్ పోస్ట్ పంచుకున్నారు. మొదట్లో ఒక్క సినిమా చేద్దామని ఇండస్ట్రీకి వచ్చానని, కెమెరా ముందు నిలబడిన తర్వాత ప్రతి షాట్, ఫ్రేమ్ తనను మార్చిందని, ఈ స్థానాన్ని కలిగించాయని తెలిపారు. 2003లో 'మనస్సినక్కరే' చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన ఆమె, 'చంద్రముఖి', 'శ్రీరామ రాజ్యం', 'జవాన్' వంటి పలు విజయవంతమైన చిత్రాలలో నటించారు.