మహిళలకు చీరలు పంపిణీ చేసిన నయనతార (వీడియో)

ప్రముఖ నటి నయనతార తాజాగా చెన్నైలోని కాళికాంబల్‌ ఆలయాన్ని సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆలయంలోని మహిళలకు చీరలను పంపిణీ చేయడంతో పాటు భక్తులకు అన్నప్రసాదాన్ని అందజేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు, నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘మూకుతి అమ్మన్‌ 2’ చిత్రం నవంబరు 6న విడుదల కానుంది.

సంబంధిత పోస్ట్

✕
✕