లారెన్స్ 'కాంచన-4' లో నయనతార?

హారర్-కామెడీ చిత్రాలకు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ‘కాంచన’ సిరీస్‌లో నాలుగో భాగంపై ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి. ‘కాంచన 4’లో లేడీ సూపర్ స్టార్ నయనతార కీలక పాత్రలో నటించనున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కథలో కీలక మలుపు తిప్పే ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లో ఆమె పవర్‌ఫుల్ పాత్రలో కనిపిస్తారని సమాచారం. ఈ చిత్రాన్ని రాఘవ లారెన్స్ స్వయంగా దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తున్నారు. ప్రధాన కథానాయికలుగా  పూజా హెగ్డే, నర్గిస్ ఫక్రీ నటిస్తున్నట్లు టాక్. నయనతార ఎంట్రీతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. అయితే ఈ వార్తలపై చిత్రబృందం నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్