ప్రముఖ నటి నయనతార చిక్కుల్లో పడ్డారు. ఇటీవలే ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీటేల్’ డాక్యుమెంటరీ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన విషయం తెలిసిందే. దీంట్లో అనుమతి లేకుండా చంద్రముఖి మూవీ క్లిప్ వాడారని నిర్మాతలు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు బుధవారం విచారణ చేపట్టిన ధర్మాసనం నయనతారతో పాటు నెట్‌ఫ్లిక్స్‌కు నోటీసులు జారీ చేసింది. అక్టోబర్ 6లోపు డాక్యుమెంటరీలో వాడిన క్లిప్స్‌పై వివరణ ఇవ్వాలని పేర్కొంది.