‘KGF’ సిరీస్ తర్వాత కన్నడ స్టార్ యష్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’. నేషనల్ అవార్డు విన్నర్ గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నయనతార ‘గంగా’ అనే పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. తాజాగా విడుదలైన ఆమె ఫస్ట్‌లుక్ ఆకట్టుకుంది. యష్ సరసన నయనతార నటించడం ఇదే తొలిసారి. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని 2026 మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఈ సినిమాను ఇంగ్లీష్, కన్నడ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరించి, తెలుగు, హిందీ, తమిళం, మలయాళం భాషల్లో డబ్ చేయనున్నారు.