విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహించిన 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' ప్రీరిలీజ్ ఫంక్షన్‌కు సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ నయనతార సడన్‌గా స్టేజీపై ఎంట్రీ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆమె రాకతో విఘ్నేశ్ భావోద్వేగానికి లోనయ్యాడు. ఈ సినిమా ఏప్రిల్ 10న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రంలో ప్రదీప్ రంగనాథన్ హీరోగా, కృతీ శెట్టి కథానాయికగా నటించారు.