వాహనదారులకు షాకిచ్చిన నయారా ఎనర్జీ.. పెట్రోల్‌ రూ.5, డీజిల్‌ రూ.3 పెంపు

ప్రైవేట్‌ ఇంధన సంస్థ నయారా ఎనర్జీ పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచింది. పెట్రోల్‌పై లీటరుకు రూ.5, డీజిల్‌పై రూ.3 చొప్పున పెంచింది. కొత్త ధరలు శనివారం తెల్లవారుజాము నుంచే అమల్లోకి వచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దేశవ్యాప్తంగా నయారాకు 7,108 పెట్రోల్‌ బంకులు ఉన్నాయి. అంతర్జాతీయంగా ముడిచమురు, రిఫైన్డ్‌ పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెరగడంతో వ్యయభారం అధికమైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు నివేదికలు పేర్కొన్నాయి. ఈ ఏడాది మార్చిలోనూ నయారా ఇదే స్థాయిలో ధరలు పెంచింది. జులైలో ఆ పెంపును వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్

✕
✕