NCP చీఫ్ శరద్ పవార్ ప్రస్తుతం ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రెండ్రోజుల క్రితం దగ్గు, ఛాతీ నొప్పితో ఆయన ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో, ఆస్పత్రిలో ఉన్న పవార్‌ను ఎన్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రఫుల్ పటేల్ కలిసి, గంటన్నర పాటు రాజకీయ అంశాలపై చర్చించారు. ఈ వీడియోలో శరద్ పవార్ చాలా బలహీనంగా, సన్నబడిపోయి కనిపించడం గమనార్హం. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో విశ్రాంతి తీసుకుంటున్నారు.