ఎన్టీఆర్ ఆశయాల సాధనకు ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉంది: మోదీ

నందమూరి తారక రామారావు 103వ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఘన నివాళులు అర్పించారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన ఓ పోస్టు పెట్టారు. ఎన్టీఆర్ చలనచిత్ర రంగానికి అందించిన సేవలు తరతరాలను అలరిస్తూనే ఉంటాయని, ఆయన జీవితం, ఆశయాలు ఎంతోమందికి స్ఫూర్తినిస్తాయని ప్రధాని పేర్కొన్నారు. తన మిత్రుడు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్డీఏ ప్రభుత్వం, ప్రజల కోసం ఎన్టీఆర్ కలలుగన్న ఆశయాలను సాకారం చేయడానికి కట్టుబడి ఉందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్