ప్రధాని నరేంద్ర మోదీ ‘ఎక్స్’ వేదికగా మాట్లాడుతూ ఎన్డీయే ప్రభుత్వం మహిళలు పూర్తి సామర్థ్యాన్ని చాటుకునేందుకు అనుకూల వాతావరణాన్ని సృష్టించిందని తెలిపారు. ఆర్థిక చేరిక, వ్యవస్థాపకత, విద్య, వైద్యం, పారిశుధ్యం, గృహ నిర్మాణం, క్రీడలు, సైన్స్, పాలన వంటి అన్ని రంగాలలో మహిళలు తమదైన ముద్ర వేస్తున్నారని ప్రశంసించారు. గౌరవం, అవకాశాలు, సాధికారత పునాదులపై ప్రభుత్వం కృషి చేసిందని, ఇది దేశ నిర్మాణంలో మహిళల భాగస్వామ్యాన్ని బలోపేతం చేసిందని పేర్కొన్నారు.