ఆసియా క్రీడలు 2026 ముగింపు వేడుకలు ఆదివారం జపాన్ నగోయాలో జరగనున్నాయి. ఈ ముగింపు వేడుకల్లో షూటర్ నీరూ దాండా భారత పతాకధారిగా వ్యవహరించనున్నారు. డిప్యూటీ చెఫ్ డి మిషన్ అంజలి భగవత్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. నీరూ ఈ క్రీడల్లో రెండు స్వర్ణాలు, ఒక రజతం గెలుచుకున్నారు. మహిళల వ్యక్తిగత ట్రాప్ విభాగంలో స్వర్ణం సాధించి, ట్రాప్‌లో పతకం గెలిచిన తొలి భారత మహిళా షూటర్‌గా రికార్డు సృష్టించారు. పురుషుల పతాకధారి ఎంపికపై శనివారం నిర్ణయం తీసుకోనున్నారు.