NEET రీటెస్ట్ ఫలితాలు విడుదల

NEET యూజీ రీటెస్ట్-2026 ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. కాసేపటి క్రితం NTA ఫలితాలను వెల్లడించింది. దేశవ్యాప్తంగా దాదాపు 20 లక్షల మంది పరీక్షలు రాయగా 11.21 లక్షల మంది క్వాలిఫై అయ్యారని NTA తెలిపింది. ఈ ఫలితాల్లో 58 శాతం మంది బాలికలు అర్హత సాధించారు. 720 మార్కులకు గాను 138 మందికి 690కి పైగా మార్కులు వచ్చాయి. కాగా మే 3న నీట్ జరగ్గా, అప్పుడు పేపర్ లీక్ కావడంతో జూన్ 21న రీటెస్ట్ నిర్వహించారు. రీటెస్ట్ ఫలితాలను https://neet.nta.nic.in వెబ్ సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.

సంబంధిత పోస్ట్