దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ పరీక్షల ఫలితాలను ఎన్‌టీఏ అధికారులు విడుదల చేశారు. మే 4న నీట్ పరీక్ష జరగగా.. ప్రాథమిక కీని అధికారులు ఇటీవల విడుదల చేసి అభ్యంతరాలు స్వీకరించారు. తాజాగా ఫలితాలు రిలీజ్ చేశారు. అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీని ఎంటర్ చేసి ఫలితాలు పొందవచ్చు. ఫలితాల కోసం https://neet.nta.nic.in/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి.