ఉత్తరాఖండ్‌లో ఏడాది బాలుడు వైద్యుల నిర్లక్ష్యంతో మృతి చెందిన ఘటన కలకలం రేపింది. ఆర్మీ అధికారి దినేష్ చంద్ర జోషి కుమారుడు శివాంష్ జోషి డీహైడ్రేషన్‌తో బాధపడుతున్నాడు. రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో 5 ఆస్పత్రులకు రిఫర్ చేశారు. ఇలా వైద్యం కోసం చిన్నారి తల్లి 180 కిమీ పరిధిలోని ఐదు ఆసుపత్రులకు తిరిగినా ఫలితం లేకపోయింది. జులై 16న చిన్నారి మరణించాడు. వైద్యుల నిర్లక్ష్యం, సరైన వైద్యసదుపాయాలు లేకపోవడం వల్లే తమ బిడ్డ చనిపోయాడని తల్లిదండ్రులు ఆరోపించారు.