యూఎస్, చైనా, భారత్ పరిహారం చెల్లించాలి: నేపాల్

నేపాల్‌లో సంభవించిన పెను వరదలు, భయావహ విపత్తుకు వాతావరణ మార్పులే ప్రధాన కారణమని ఆ దేశ విదేశాంగ మంత్రి షిశిర్ ఖనాల్ స్పష్టం చేశారు. కార్బన్ ఉద్గారాలను అత్యధికంగా విడుదల చేస్తున్న అమెరికా, చైనా, భారత్‌లే ఈ నష్టానికి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. తాము చేయని తప్పునకు భారీ మూల్యం చెల్లిస్తున్నామని, ఇది సహాయం కాదని, నష్టపరిహారం చెల్లించడం ఆయా దేశాల నైతిక బాధ్యత అని నేపాల్ ప్రభుత్వం పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్