నేపాల్ వరద.. విదేశీ సహాయాన్ని తిరస్కరించిన ఖాఠ్మండు

భోటేకోషి వరదల్లో తీవ్రంగా నష్టపోయిన నేపాల్ సహాయక బృందాలను పంపేందుకు భారత్, చైనా సహా పలు దేశాల ప్రతిపాదనలను ఖాఠ్మండు తిరస్కరించింది. తమ సొంత భద్రతా సంస్థలకే ఈ ఆపరేషన్‌ను నిర్వహించే సామర్థ్యం ఉందని పేర్కొంది. అయితే, అంతర్జాతీయ సాంకేతిక నిపుణుల సహాయం అవసరమైతే కోరేందుకు సిద్ధంగా ఉన్నట్లు విదేశాంగ మంత్రి శిశిర్ ఖనాల్ తెలిపారు. 2015 భూకంపం నాటి సమన్వయ సమస్యల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆర్థిక సహాయాన్ని మాత్రం నేపాల్ కోరుతోంది.

సంబంధిత పోస్ట్

✕
✕