నేపాల్ వరద నీరు భారత్‌లోకి ప్రవేశించింది. భోటేకోశి, త్రిశూలి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ నదులు నారాయణి నదిలో విలీనమై.. గండక్ నదిగా భారత్‌లోకి ప్రవేశించాయి. ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్ జిల్లాలో గండక్ నది నుంచి అధికారులు మూడు మృతదేహాలను వెలికితీశారు. వీరిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. వరద నీరు భారత్‌లో ప్రవేశించడంతో NDRF, SDRF బృందాలు అప్రమత్తం అయ్యాయి.