నేపాల్‌లో వరదలు.. భారత్‌లోకి కొట్టుకువస్తున్న మృతదేహాలు (వీడియో)

నేపాల్‌లో వరదల కారణంగా మృతి చెందిన పలువురి మృతదేహాలు భారత్‌ సరిహద్దు నదుల్లోకి కొట్టుకొస్తున్నాయి. నేపాల్‌ నుంచి భారత్‌లోకి ప్రవహించే నదుల నుంచి ఇప్పటివరకు 7 మృతదేహాలను అధికారులు వెలికితీశారు. చిత్వాన్‌ జిల్లాను ఆనుకుని ఉన్న ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్‌ జిల్లాలో 4 మృతదేహాలు లభ్యమయ్యాయి. కుషీనగర్‌ జిల్లాలో మరో 3 మృతదేహాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు చిత్వాన్‌లో ఇప్పటివరకు 132 మృతదేహాలను నేపాల్‌ అధికారులు వెలికితీశారు. వరదల నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండి సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕