నేపాల్ వరదలపై 5నెలల ముందే హెచ్చరికలు!

నేపాల్‌లో సంభవించిన భారీ వరదలపై ‘ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ మౌంటెన్ డెవలప్‌మెంట్’ (ICIMOD) 5 నెలల ముందే హెచ్చరించినట్లు కథనాలు వెలువడుతున్నాయి. హిందూకుష్ హిమాలయ ప్రాంతాల్లో మంచు వేగంగా కరుగుతోందని మార్చిలోనే సంస్థ వెల్లడించినట్లు తెలుస్తోంది. 2000వ సంవత్సరంతో పోలిస్తే మంచు కరిగే వేగం రెట్టింపైనట్లు పేర్కొంది. సాధారణంగా మంచు పడే 4,000 మీటర్లకుపైగా ఎత్తైన ప్రాంతాల్లో ప్రస్తుతం వర్షాలు కురవడం, మంచు వేగంగా కరగడం వల్ల ఆకస్మిక వరదలు సంభవించే ప్రమాదం ఉందని ICIMOD నిపుణుడు ఫరూక్ హెచ్చరించినట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕