ప్రకృతి విపత్తుతో అతలాకుతలమైన నేపాల్‌కు భారత్ అందించిన సహాయంపై ఆ దేశ ప్రధాని బాలెన్ షా కృతజ్ఞతలు తెలిపారు. వరదలు సంభవించిన తొలి రోజే భారత్ స్పందించి సహాయ సామగ్రిని పంపిందని పార్లమెంటులో కొనియాడారు. మందులు, ఆహార పదార్థాలు, నీటిని శుద్ధి చేసే పరికరాలతో పాటు నిపుణులైన సహాయక బృందాన్ని పంపిందని వెల్లడించారు. నష్టం తీవ్రతను అంచనా వేసేందుకు పరిశీలనలు కూడా నిర్వహించారని చెప్పారు. సంక్షోభ సమయంలో భారత్ నిజమైన మిత్రదేశంగా.. అండగా నిలిచిందని ప్రశంసించారు.