నేపాల్, టిబెట్ సరిహద్దుల్లో సంభవించిన భారీ ఫ్లాష్ ఫ్లడ్స్ కారణంగా కైలాస మానస సరోవర్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేయబడింది. జలప్రళయం వల్ల కీలక రహదారులు దెబ్బతినడంతో, నేపాల్ మీదుగా జరగాల్సిన యాత్రను అధికారులు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే యాత్రకు బుక్ చేసుకున్న భక్తుల్లో ఆందోళన నెలకొంది. రసువగఢీ ప్రాంతంలో వరదలు రావడంతో మానస సరోవరానికి వెళ్లే మార్గాలు మూసుకుపోయాయి. యాత్రికుల భద్రత దృష్ట్యా, పర్యాటకులు తమ స్వస్థలాలకు తిరిగి వెళ్లాలని అధికారులు సూచించారు. కొత్త బుకింగ్స్‌పై టూర్ ఆపరేటర్లకు కూడా సూచనలు జారీ అయ్యాయి.