ఇజ్రాయెల్‌ ఫలితాల్లో నెతన్యాహు వర్గానికి ఆధిక్యం

ఇజ్రాయెల్‌ పార్లమెంట్‌ ఎన్నికల ఫలితాల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు నేతృత్వంలోని కూటమికి 55 స్థానాలు, గాడి ఐజెన్‌కాట్‌ నేతృత్వంలోని మార్పు కూటమికి 49, అరబ్‌ పార్టీలకు 16 స్థానాలు వచ్చే అవకాశాలున్నాయి. తుది ఫలితాల్లో డబుల్‌ బ్యాలెట్‌ ఓట్లు కీలకం కానున్నాయి. ఈ ఓట్లు దాదాపు 15 స్థానాల సమీకరణాలను ప్రభావితం చేయవచ్చని అంచనా. స్పష్టమైన మెజారిటీపై అనిశ్చితి నెలకొనడంతో, తదుపరి ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ కొనసాగుతోంది.

సంబంధిత పోస్ట్

✕
✕