ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రసంగం తీవ్ర చర్చకు దారితీసింది. ఆయన ప్రసంగం ప్రారంభం కాగానే పలుదేశాల ప్రతినిధులు నిరసనగా వాకౌట్ చేయడంతో సభలో పలు కుర్చీలు ఖాళీగా కనిపించాయి. ఇజ్రాయెల్ ఏడు రంగాల్లో యుద్ధం చేస్తోందని నెతన్యాహు పేర్కొన్నారు. 2024లో లెబనాన్లో హిజ్బుల్లా పేజర్ల పేలుళ్లను గుర్తుచేస్తూ ప్రసంగంలో ఓ పేజర్ను పైకెత్తి చూపారు. ఇరాన్ అణ్వాయుధాల అభివృద్ధిని అడ్డుకున్నామని, ఇరాన్ ప్రభుత్వం పతనం సమీపంలో ఉందని ఆయన వ్యాఖ్యానించారు.