'హైకూ' డిజిటల్ హక్కులు సొంతం చేసుకున్న నెట్‌ఫ్లిక్స్

ప్రపంచ స్థాయి ఓటీటీ దిగ్గజాల్లో ఒకటైన నెట్‌ఫ్లిక్స్, తమిళ చిత్రం 'హైకూ' డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. ఈగన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్ర షూటింగ్ కేరళలోని ఇడుక్కి ప్రాంతంలో  ప్రారంభమైంది. దర్శకుడు రామ్ ముహూర్తపు సన్నివేశంపై క్లాప్ కొట్టారు. యువరాజ్ చిన్నసామి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను విజన్ సినిమా హౌస్ బ్యానర్‌పై డా.డి.అరుళనందు, మాథ్యూ అరుళనందు నిర్మిస్తున్నారు. షూటింగ్ ప్రారంభమైన రోజే నెట్‌ఫ్లిక్స్ ఈ చిత్ర డిజిటల్ హక్కులు సొంతం చేసుకోవడం, కంటెంట్‌పై వారికున్న నమ్మకాన్ని తెలియజేస్తోంది.

సంబంధిత పోస్ట్