ధోని వ్యాఖ్యలపై నెటిజన్ల ఫైర్

భారత క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోని, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల భవిష్యత్తుపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. 2027 వన్డే ప్రపంచకప్‌లో ఈ ఇద్దరు సీనియర్లు ఆడతారని ధోని మద్దతు తెలిపారు. అయితే, కొందరు నెటిజన్లు ధోనిపై విమర్శలు గుప్పిస్తున్నారు. గతంలో ఫిట్‌నెస్ సాకుతో వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్ వంటి ఆటగాళ్లను పక్కన పెట్టిన ధోని, ఇప్పుడు రోహిత్, కోహ్లీల వయసు గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు, రాబోయే టీ20 ప్రపంచకప్‌లో టాస్, మంచు ఫ్యాక్టర్ భారత్‌కు సవాలుగా మారవచ్చని ధోని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్